
ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలం పరిశీలన
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండల కేంద్రంతోపాటు మనోహరాబాద్, కొలిప్యాక్, తొర్లికొండ, అర్గుల్ గ్రామాల పరిఽధిలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలా న్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం (ముగ్గురు సభ్యులు) బుధవారం పరిశీలించింది. ఐదేళ్ల క్రితం స్థలాన్ని తమ బృందం పరిశీలించిందని, అయితే ఏవైనా మార్పులు జరిగాయా అని తెలుసుకునేందుకు మళ్లీ పరిశీలించి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. తొర్లికొండ శివారులోని చెరువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపాదిత స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందని స్థానిక అధికారులను ప్రశ్నించారు. ప్రతిపాదిత స్థలం ప్రస్తుత పరిస్థితిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపిస్తామని వారు తెలిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, డిప్యూటీ తహసీల్దార్ దత్తాద్రి, ఏడీ సర్వే అశోక్, డీఐ జగన్నాథ్, ఆర్‌ఐ ప్రవీణ్, సర్వేయర్లు రత్నాకర్, డానియల్ తదితరులున్నారు.