
కాకతీయకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
ఇంటర్ ఫలితాల్లో కాకతీయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తాచాటారు. సెకండియర్ ఎంపీసీలో సఫాఅఖిల్ (992/1000) రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకు, త్రిషాచౌదరి (991) ఐదో ర్యాంకు, ఆయేషా ఫాతిమా (988)ఏడో ర్యాంకు సాధించారు. అలాగే బైపీసీలో అమ్ముతుల్ మోహిరీనా (992/1000), జూనారీయా అంబేర్ (992) మార్కులతో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకులు సాధించగా, సోహాసనీలా (988)కు ఎనిమిదో ర్యాంకు దక్కింది.
ఫస్టియర్‌లో..
ఎంపీసీలో బి.కావ్యశ్రీ (467/470) రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు, ఎం.హర్షిత (466), పి.నిత్యశ్రీ(466), ఎం.మృదుల(466), లాస్యశ్రీ(466) మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. కె.కీర్తి (465), ఎం.అశ్రిత(465) నాల్గో ర్యాంకు సాధించారు. ,
బైపీసీలో హనియా ఉమేమా(435/440), వి.ఇందు (435) మార్కులతో మూడోర్యాంకులు సాధించగా, తుబాఫాతిమా(434), రిమ్‌షా అనమ్(434), వై.శ్రీనిత్య(434) మార్కులతో నాల్గో ర్యాంకు సాధించారు.

కాకతీయకు రాష్ట్రస్థాయి ర్యాంకులు