
ఆర్టీసీ బస్టాండ్‌లో షటర్ వివాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ముందు శుక్రవారం ఓ షటర్ వ్యవహారంలో వివాదం చోటుచేసుకుంది. 20 ఏళ్ల క్రితం నుంచి బస్టాండ్ ముందు షటర్ వేసుకుని టీ వ్యాపారం చేసుకుంటున్నామని తమదే ఆ షటర్ అని ఓ మహిళ తెలిపింది. ఆ షటర్‌ను ఆర్టీసీ యూనియన్‌కు కేటాయించినట్లు నాయకులు తెలిపారు. ఆ షటర్ తమదేనంటూ ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకున్నాయి. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతారని పోలీసులు వారికి నచ్చజెప్పి గొడవను సద్దుమనిగించారు.
రోడ్డుపైనే ధాన్యం ఆరబోత
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల, శెట్పల్లి, భవానిపేట, ఒంటర్‌పల్లితో పాటు పలు గ్రామాలకు వెళ్లే రోడ్డుపైనే ధాన్యం ఆరబోశారు. రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కళ్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
దగ్ధమైన ఈత వనాల
పరిశీలన
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలో ఈదుల్ల వాగు వద్ద ఇటీవల దగ్ధమైన ఈత వనాన్ని శుక్రవారం పరిశీలించినట్లు ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ తెలిపారు. సుమారు 300 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాద వశాత్తు దగ్ధమయ్యాయా, ఎవరైనా దహనం చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఎకై ్సజ్ ఎస్సై జగన్మోహన్, సిబ్బంది ఉన్నారు.

ఆర్టీసీ బస్టాండ్‌లో షటర్ వివాదం

ఆర్టీసీ బస్టాండ్‌లో షటర్ వివాదం