వర్ని(చందూర్): కారును అజాగ్రత్తగా నడిపి ఒకరికి మృతికి కారణమైన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానాను బోధన్ కోర్టు న్యాయమూర్తి సాయిశివ విధించారని ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. ఎస్సై బుధవారం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన శాఖమూరి బస్వపూర్ణ(60) అనే వృద్ధురాలు 2016నవంబర్27న చందూర్‌లోని బంధువుల ఇంటి వచ్చి బస్టాండ్‌కు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఎడపల్లికి చెందిన పాముల అశోక్ కారులో వేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సాక్షాల్యను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలు విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
మాచారెడ్డి: మండలంలోని తడకపల్లి శివారులో ఇద్దరు వన్యప్రాణుల వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై అనిల్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అటవీ శాఖ సెక్షన్ అధికారి ఎంఏ ఫారూఖ్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సైల్పె అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద చనిపోయిన అడవి పంది, దానిని చంపడానికి ఉపయోగించిన తాడు ఉన్నాయి. అనంతరం వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.