
ఏర్గట్లలో ప్రశాంత్‌రెడ్డి భార్య నీరజ
మోర్తాడ్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నా రు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల సు నీల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి దీప్తి, బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి భార్య నీరజ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.
పతి కోసం సతి ప్రచారం చేయడంలో భాగంగా ఓ టర్లను స్వయంగా కలుసుకుంటూ పార్టీ మేనిఫెస్టో లతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను వివరిస్తున్నారు. అభ్యర్థుల భార్యల ప్రచారంలో ఆయా పార్టీ ల కార్యకర్తల భార్యలు కూడా పాలుపంచుకోవడం విశేషం. అభ్యర్థులు గ్రామాల్లో కా ర్నర్ సమావేశాలు నిర్వహిస్తుంటే వారి భార్యలు, కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.

మోర్తాడ్‌లో ప్రచారం చేస్తున్న సునీల్‌రెడ్డి భార్య దీప్తి