పుట్టిన రోజే ఆకస్మిక మరణం
నిజామాబాద్ అర్బన్: వైద్యశాఖకు చెందిన ఉద్యోగి సంజీవరావు(53) గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. జిల్లా కేంద్రానికి చెందిన సంజీవరావు గురువారం తన పుట్టిన రోజు కావడంతో నూతన బట్టల కొనుగోలుకు మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఛాతిలో నొప్పిరావడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈసీజీ తీసిన తర్వాత మరణించారు. వైద్యులు సీపీఆర్ చేసినా ప్రయత్నం లేకుండా పోయింది. అతని పుట్టిన రోజే మరణించడం విషాదంగా మారింది. ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కళాశాలలో పరిపాలన అధికారిగా కొనసాగుతున్నారు. అతని అంత్యక్రియలు బిచ్కుందలో శుక్రవారం నిర్వహించారు. సంజీవరావు అకాల మృతికి జిల్లా టీఎన్జీవోస్ సభ్యులు నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అతని కుటుంబానికి టీఎన్జీవోస్ అండగా ఉంటుందని సంఘం అధ్యక్షుడు సుమన్ పేర్కొన్నారు. గతంలో టీఎన్జీవోస్ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడుగా సంజీవరావు పనిచేశాడని అన్నారు.
● గుండెపోటుతో వైద్యశాఖ ఉద్యోగి మృతి
పుట్టిన రోజే ఆకస్మిక మరణం


