చోరీ కేసుల్లో నిందితుడి రిమాండ్
డిచ్‌పల్లి: చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ కే వినోద్, ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో ఈ నెల 12న జరిగిన రెండు దొంగతనాలలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా జిల్లా కేంద్రానికి చెందిన బంగారు రాజు అనే వ్యక్తి అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో అతను గతంలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి మెంట్రాజ్‌పల్లిలో చోరీ చేసి 3.5 గ్రాముల బంగారం, 12 తులాల సిల్వర్ పట్టగొలుసులు, రూ.20 వేల నగదును పోలీసులు రికవరీ చేశారు. అలాగే బాన్సువాడలో చోరీ చేసి నడుపుతున్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


