బాధ్యతలు స్వీకరించిన ఏపీపీలు
బోధన్: పట్టణ కేంద్రంలోని కోర్టులో ఇద్దరు ఏపీపీలు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్ మండలంలోని ఎరాజ్‌పల్లికి చెందిన న్యాయవాది బోధన్ కోర్టు ఐదవ అదనపు జిల్లా కోర్టు, సెషన్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది సీహెచ్‌వీ హనుమంతరావు అసిస్టెంట్ సెషన్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన ఏపీపీలను బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ రాములు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.


