రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
నవీపేట: మండలంలోని అబ్బాపూర్(ఎం) గ్రామ సమీపంలో బాసర రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మాలపల్లి సమీపంలో ఒక కారును మరో కారు ఢీకొనడంతో ఇరువురు పోటాపోటీగా రన్నింగ్‌లోనే వాదోపవాదాలకు దిగారని పేర్కొన్నారు. అబ్బాపూర్(ఎం) సమీపంలో వేగంగా ముందుకు వచ్చిన ఒకకారు మరోకారును అడ్డుకునేందుకు యత్నించగా రెట్టింపు వేగంతో ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు బోల్తాపడి ..సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లాయన్నారు. బోల్తాపడిన కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై వస్తున్న ముగ్గురిని ఢీకొన్నదని అన్నారు. ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున విజయ్, ధన్‌వీర్, బిట్టులతో పాటు బైక్‌పై వస్తున్న షేక్ సలీమ్, సల్మాబేగమ్, సోఫియా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


