గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: నగరంలోని శివాజీనగర్‌లో ఉన్న ఐటీఐ కళాశాల ప్రాంగణంలో గంజాయి అ మ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్ ఎస్సై సయ్యద్‌ముజాయిద్ తెలిపారు. షేక్‌అఫ్రోజ్ అనే వ్యక్తి గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతని వ ద్ద ఉన్న 210 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి జిల్లాకు తీసుకవచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇతనిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో 13 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.


