న్యూస్‌రీల్
నిర్మల్
● నేతల ప్రసంగంతో శ్రేణుల్లో ఫుల్‌జోష్
‘కౌలు’కోలేని దెబ్బ
ఎల్‌నినోతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఖరీఫ్ పంటల దిగుబడి తగ్గింది. రబీలో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఖోఖో జట్ల ఎంపిక
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–14 జిల్లాస్థాయి ఖోఖో పోటీలు మంగళవారం నిర్వహించారు. ఇందులో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంఈవో రాజునాయక్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పెటా జిల్లా అధ్యక్షులు అంబాజీ, కృష్ణ, సత్తయ్య, డేవిడ్, భూషణ్, శంకర్, అశోక్, మహేంద్రచారి, అశోక్, హరిప్రసాద్, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలుర జట్టు..
గౌతమ్, శ్రీనిక్షిత్, గంగచరణ్, నందకిశోర్, అఖిలేష్, ఈశ్వర్, సాత్విక్, రాఘవ, రిశ్వంత్, సాయిజయంత్, విష్ణువర్ధన్, గంగదీప్, మనోజ్, సాత్విక్, నాగవెంకటేశ్, వరుణ్, రాహుల్, మణిదీప్, రిత్విక్.
బాలికల జట్టు..
నవీన, ప్రవస్తిక, రమణి, మనిశ్రీ, అణజ్ఞ, అక్షర, అవంతిక, అక్షిత, వరణ్య, మహేశ్వరి, గంగలక్ష్మి, శ్రీవల్లి, సాదియా తబస్సుం, మన్విత, తేజశ్విని.
నిర్మల్: ‘ఛత్రపతి శివాజీ వారసులకు, కత్తిలాంటి కార్యకర్తలకు జన్మనిచ్చిన నిర్మల్‌గడ్డకు దండాలు’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ జోష్ నింపారు. ‘నిర్మల్ జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలను చూస్తుంటే వచ్చేది మన ప్రభుత్వమే అని స్పష్టమవుతోంది’ అని ఎంపీ ఈటల రాజేందర్ ఉత్సాహాన్ని పెంచారు. ‘వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వెంట నడిచిన కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి అన్న మాటలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. ఓట్ చోరీ అంటూ అటు కాక్రోచ్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు, ప్రజల్లోకి తమ వాదనను తీసుకెళ్లేందుకు ఉత్తర తెలంగాణలో బీజేపీ నిర్వహించిన తొలి మహాపాదయాత్ర విజయవంతమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం దాదాపు నాలుగు గంటలపాటు సాగిన కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌పార్టీ నిరసనలకు భారీ జనసమీకరణతో పార్టీ సమాధానం చెప్పడం కాషాయదళంలో కొత్త ఉత్సాహాం నింపింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, ఈ కార్యక్రమ ముఖ్యఅతిథి సునీల్ బన్సల్ సభలో మాట్లాడకపోవడం గమనార్హం.
నేడు జోనల్‌స్థాయి
బాస్కెట్ బాల్‌పోటీలు
లక్ష్మణచాంద: మండలంలోని పీచరలో జోనల్‌స్థాయి బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు బుఽ దవారం నిర్వహించనున్నట్లు హెచ్‌ఎం సాయికృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో అండర్–14 జోనల్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రీడాకారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
రెండు గంటలు నడిచి..
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డు హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌బన్సల్ చేరుకున్నారు. ఆయనతోపాటు మిగిలిన పార్టీ నేతలందరూ కలిసి ప్రత్యేక వాహనంలో స్థానిక శాంతినగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి.. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సునీల్‌బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర సహ ఇన్‌చార్జీలు రేఖాశర్మ, అభయ్‌పాటిల్, కేంద్రమంత్రి బండి సంజయ్, ఆదిలాబాద్, మల్కాజ్‌గిరి ఎంపీలు గోడం నగేశ్, ఈటల రాజేందర్, ముధోల్, ఆదిలాబాద్, సిర్పూర్, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్, సీనియర్ నాయకులు, భారీసంఖ్యలో వచ్చిన కార్యకర్తలతో కలిసి మహాపాదయాత్ర ప్రారంభించారు. శాంతినగర్ చౌరస్తా నుంచి శివాజీచౌక్, చైన్‌గేట్, జయశంకర్ సర్కిల్ మీదుగా వివేక్‌చౌక్ వరకు దాదాపు రెండు గంటలు పాదయాత్ర చేశారు. వివేక్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు.


