తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

నిర్మల్‌టౌన్‌: ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవిలో నిర్మల్‌ పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి తెలిపారు. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టును అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. నీటి నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు వేసవి అవసరాలకు సరిపోతాయని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో నిల్వలు తగ్గినా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, తాగునీటి పైపులైన్లలో లీకేజీలు గుర్తిస్తే వెంటనే మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవిలో నిరంతర నీటి సరఫరాకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్లు గోపు గోపి, పెండం శ్రీనివాస్‌, నాందేడపు చిన్ను, రఫీ, చెనిగరపు నరేశ్‌, జాకీ, శ్రీకాంత్‌ యాదవ్‌, డీఈ హరిభువణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement