ప్రతిభను వెలికితీసేందుకే యువజనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభను వెలికితీసేందుకే యువజనోత్సవాలు

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

● అదనపు కలెక్టర్‌ రమేశ్‌ రాథోడ్‌

నిర్మల్‌టౌన్‌: యువతలోని ప్రతిభను, సృజనాత్మకతను, కళానైపుణ్యాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని అదనపు కలెక్టర్‌ రమేశ్‌రాథోడ్‌ అన్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోఫీనగర్‌లో జేవీఎన్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు–2026 పోటీలు మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యువత తమలోని ప్రతిభను గుర్తించి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని సూచించారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని స్వామి వివేకానంద ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జానపద బృంద గానం, జానపద బృంద నత్యం, నాటిక, చిత్రలేఖనం, కవితారచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రథమ బహుమతి సాధించిన విజేతలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే యువజన పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన ,క్రీడలశాఖ అధికారి బి.శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి, న్యాయ నిర్ణేతలు జోసఫ్‌ బాబురావు, ఎట్టెం రజిత, సౌమ్య, మధు, మెట్టు రవి, కొండూరు పోతున్న, విశ్వనాథ్‌వర్మ, చెనిగారపు నాగరాజు, వేణుగోపాల్‌, ఎర్రన్న, రఫీక్‌, రవీందర్‌, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement