నిర్మల్: ప్రజాస్వామ్య పరిరక్షణ, అరాచకవాదా న్ని తరిమికొట్టడమే లక్ష్యంగా జిల్లాకేంద్రంలో మంగళవారం చేపట్టనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కోరారు. బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి నివాసంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోందని, రాజ్యాంగ సంస్థలపై దాడులకు పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే ఈ మహాపాదయాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రావుల రాంనాథ్, యాతాళం చిన్నారెడ్డి, మెడిసెమ్మె రాజు, సత్యం చంద్రకాంత్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


