అలసిపోతున్న ఆర్టీసీ | - | Sakshi
Sakshi News home page

అలసిపోతున్న ఆర్టీసీ

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

● మొరాయిస్తున్న ప్రగతిచక్రం..! ● తరచూ మొరాయిస్తున్న బస్సులు ● రోజుకు 66 వేల కిలోమీటర్ల ప్రయాణం ● పెరిగిన ఓఆర్‌తో ఫిట్‌నెస్‌పై ప్రభావం మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

సెమిస్టర్‌కు స్వస్తి!

పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సరంలో వార్షిక పరీక్షల విధానం ప్రవేశపెట్టడానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది.

ప్రజావాణి ఫిర్యాదులపై

స్పందించాలి

నిర్మల్‌టౌన్‌: ప్రజావాణిలో అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టపరంగా పరిష్కారం చూపాలని ఎస్పీ జానకీషర్మిల అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతీ ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారంలో అనవసర జాప్యం లే కుండా, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్య వహరించాలని ఆదేశించారు. అంతకుముందు స్వయంగా నడవడానికి ఇబ్బంది పడుతున్న ప లువురు దగ్గరికి వెళ్లి వినతిపత్రం స్వీకరించా రు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

అక్టోబర్‌ 26న నిర్మల్‌ బస్‌స్టాండ్‌ నుంచి హిమాయత్‌నగర్‌ వెళ్లే బస్సు సోమవారం స్టేజీ వద్ద ఇంజిన్‌ స్టార్ట్‌ కాక నిలిచిపోయింది. కండక్టర్‌ సూచనల మేరకు మహిళా ప్రయాణికులతోపాటు ఇతరులు బస్సును ముందుకు నెట్టేందుకు ప్రయత్నించారు. సుమారు 20 నిమిషాలపాటు ఈ పరిస్థితి కొనసాగింది. ఇదేరోజు భైంసా డిపోకు చెందిన భైంసా–ధర్మాబాద్‌ బస్సు తిరుగు ప్రయాణంలో తానూరులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ప్రయాణికులు దిగి నెట్టాల్సి వచ్చింది.

ఆర్టీసీ డిపోలో రిపేర్‌ షెడ్డులో ఉన్న బస్సులు

ఫిట్‌నెస్‌పై ప్రభావం

పరిమితికి మించిన ప్రయాణికులు, అధిక బరువు, కొన్ని మార్గాల్లో అధ్వాన్న రోడ్లు కారణంగా టైర్లు నిర్ణీత గడువు కంటే ముందే అరిగిపోతున్నాయి. కనీస నిర్వహణ లోపించడంతో స్టార్టింగ్‌ సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి. గమ్యస్థానాలకు చేరాల్సిన బస్సులు మార్గమధ్యలో నిలిచిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. టికెట్‌ ఉచితమే అయినా సమయానికి చేరుకోలేకపోతున్నామని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు డిపోల వారీగా బస్సుల మెకానికల్‌ కండిషన్‌ను నిశితంగా పరిశీలించాలి. తక్షణమే బ్రేక్‌డౌన్‌ సమస్యలను పరిష్కరించాలి. అవసరమైతే కొత్త బస్సులు కేటాయించాలి. డిమాండ్‌కు తగ్గట్టు జిల్లాకు అదనపు బస్సులు అందించాలని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో బస్సుల కండిషన్‌ను పరీక్షించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement