లక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి బాస్కెట్బాల్ సెలక్షన్స్ సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై శ్రావణి, ఎంఈవో రాజునాయక్, సర్పంచ్ రాజేశ్వర్ హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
బాలుర జట్టు..
మహేశ్, వెంకటరమణ, దీక్షిత్, రిషి, శ్రేయాన్, అనూష్, ఇనోష్, శశిధర్, వేదాంశ్రీ, ఇరుమై, మణికంఠ, శరత్.
బాలికల జట్టు..
హర్షిత, రక్షిత, దీక్షిత, యోగిత, సమీక్షరెడ్డి, సహస్రరెడ్డి, ఎమీలియా, వర్షిణి, ప్రహర్ష, హారిక, సురేఖ, ప్రణవి, చందన.


