విద్యారంభం కరిష్యామి | - | Sakshi
Sakshi News home page

విద్యారంభం కరిష్యామి

Oct 17 2026 8:06 AM | Updated on Oct 17 2026 8:06 AM

నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యమివ్వాలి

వీబీజీ రామ్‌జీ సూక్ష్మ ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

మొదలైన ఎల్‌నినో ప్రభావం పడిపోతున్న భూగర్భ జలాలు పెరుగుతున్న కరెంటు కోతలు సీఎం ప్రకటనతో రైతుల్లో ఆందోళన ఆరుతడి పంటలు మేలంటున్న వ్యవసాయాధికారులు

– వివరాలు IIలోu

నిర్మల్‌ జిల్లా బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా బాసర క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. రోజంతా ప్రత్యేక పూజలు, దర్శనాలతో క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆలయ పునర్నిర్మాణం, బాలాలయంలో దర్శనాల నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రాక కాస్త తగ్గిందని అధికారులు తెలిపారు.

– భైంసా/బాసర

భక్తితో అమ్మకు మొక్కుతూ...

కుంటాల:

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా

మండలంలోని ఓలా గ్రామంలో ప్రతిష్టించిన అమ్మవారిని రూ.2 లక్షల నోట్లతో అలంకరించారు. కరెన్సీ నోట్లతో భక్తులకు అమ్మవారు దివ్య దర్శనం ఇచ్చారు.

అక్షరాభ్యాస పూజలో తల్లీకూతరు..

యాసంగి.. అయోమయం

లక్ష్మణచాంద: ఎల్‌నినో ప్రభావం మొదలైంది. కరు వు తరుముకొస్తోంది. జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కరెంటు కోతలు పెరుగుతున్నాయి. వానా కాలం పంటలను కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా గా సీఎం రేవంత్‌రెడ్డి యాసంగిలో వరి వేయొద్దని ప్రకటించారు. దీంతో రైతుల్లో యాసంగిపై అయోమయం నెలకొంది. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ప్రాజెక్టుల్లో నీళ్లు సరిపోవు

ఎల్‌నినో కారణంగా ఈసారి వర్షాలు కురవలేదు. 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండలేదు. స్వర్ణ, శ్రీరాంసాగర్‌, గడ్డెన్నవాగు, కడెం, సదర్‌మాట్‌ వంటి ప్రాజెక్టుల్లో సాగుకు సరిపడా నీరు లేదు. ఉన్న నీటిని పొదుపుగా వినియోగించి వేసవిలో తాగునీటి అవసరాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యాసంగిలో వరికి నీ రు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

విద్యుత్‌ కోతలు షురూ..

వానాకాలం పంటలు చేతికి వచ్చే సమయంలోనే తరచూ విద్యుత్‌ కోతలు ఎదురవుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. యాసంగిలో విద్యుత్‌ సమస్యలు మరింత పెరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వరి సాగు చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు.

అవగాహన కల్పించాలి..

కరువు పరిస్థితుల్లో వరికి బదులు ఆరుతడి పంటలపై గ్రామాల్లోకి వ్యవసాయాధికారులు వెళ్లి విస్తృత అవగాహన కల్పిస్తే మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

సరస్వతీదేవిగా అడెల్లి పోచమ్మ

కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ

జాబ్‌కార్డు ఉన్నవారికి పని కల్పించాలి

భైంసాటౌన్‌: ప్ర స్తుత ఎల్‌నినో పరిస్థితులతో వ్య వసాయరంగం తీవ్ర ప్రభావానికి లోనవుతున్న నేపథ్యంలో జాబ్‌కార్డు కలిగిన ప్ర తి ఒక్కరూ వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ఉపాధి పొందాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అన్నారు. పట్టణంలో జోన్‌ 4, 5లకు సంబంధించి వీబీజీ రామ్‌జీ పథకం అమలుపై గ్రామీణస్థాయి సూ క్ష్మ ప్రణాళికపై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి పాల్గొన్నారు. ఎల్‌నినోతో వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి పొందేందుకు వీబీజీ రామ్‌జీ పథకం మంచి అవకాశమని సూచించారు. జాబ్‌ కార్డు ఉన్న ప్ర తి ఒక్కరూ 125 రోజుల పనిదినాలు పొంది, ఆర్థిక స్వాంతన పొందాలన్నారు. ప్రస్తుత అధి క ఉష్ణోగ్రతలు, లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయని, జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా ఈ పథకంలో భాగంగా పెద్ద ఎత్తున నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

అధికారులు ప్రోత్సహించాలి..

వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పొందేలా అధికారులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ సూ చించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలకు ఉపాధి కల్పిస్తే వారికి ఊరట లభిస్తుందన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పథకం గురించి విస్తృత ప్రచారం కల్పించి, రైతులు తమ వ్యవసాయ సంబంధ పనులు చేసుకునేందుకు వీలు కల్పించాలన్నా రు. పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ తుకారాం, తహసీల్దార్‌ శశిభూషణ్‌, ఎంపీడీవో పుష్పలత, సర్పంచులు పాల్గొన్నారు.

ఏం వేయాలి..

జిల్లాలో వానాకాలంలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగా రెండో పంటకు నీరు విడుదల చేయలేమని ప్రభుత్వం చెప్పడంతో యాసంగిలో ఏం వేయాలని రైతులు పునరాలోయనలో పడ్డారు.

ఆరుతడే ప్రత్యామ్నాయం

ప్రస్తుత కరువు పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాల ని సూచిస్తున్నారు. చిరు ధాన్యాలైన జొన్నలు, సజ్జలు, పప్పుధాన్యాలైన పెసర, మినుము, కంది, శనగ, నూనెగింజ పంటలైన వేరుశన గ, కుసుమ, ఆముదం, నువ్వులు వంటివి సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

తక్కువ తడులతో సాగయ్యే పంటలు వేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నేపథ్యంలో తక్కువ తడులతో సులభంగా సాగ య్యే పంటలను మాత్రమే వేసేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో వ్యవసాయ సంబంధిత అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వరి పంటకు ప్ర త్యామ్నాయంగా ఇతర పంటలను సాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అధికా రులు అంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు సహకారం అందించాలన్నారు. ఎ క్కడైనా పంటలు నష్టపోతే వివరాలు పారదర్శకంగా సేకరించాలన్నారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వే, ఫార్మర్‌ రిజిస్ట్రీ త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఏవో సుజాత, ఉద్యానవన అధికారి రమణ, అధికారులు పాల్గొన్నారు.

కుంటాల : యాసంగి పంట

వేసేందుకు చేను దున్నుతున్న రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement