ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె పదోరోజుకు చేరింది. జిల్లా కేంద్రంలో గురువారం ఉద్యోగులు ఒంటి కాలిపై నిల్చుని వినూత్న నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. తమను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఉద్యోగులకు 180రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి కుటుంబ భద్రత కల్పించాలని కోరారు. 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు గంగాధర్‌, రమణ, రమేశ్‌, అలీ, నాగరాజు, జైపాల్‌, వంశీ, వెంకటరమణ, సుజాత, పద్మ, సరస్వతి, రాధ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement