గురువా.. మేలుకో! | - | Sakshi
Sakshi News home page

గురువా.. మేలుకో!

Oct 23 2026 12:03 AM | Updated on Oct 23 2026 12:03 AM

విద్యార్థిని లోపల మరిచి తరగతి గదికి తాళమేసిన ఉపాధ్యాయులు దసరా సెలవుల ముందు ఘటన గతంలో ‘యూబిట్‌’ దందాలోనూ.. నిర్లక్ష్యం వీడని పలువురు టీచర్ల్లు నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

నిర్మల్‌: దసరా సెలవులకు ఒక్కరోజు ముందు.. అ క్టోబర్‌ 7న తానూరు మండలం బెంబర ప్రాథమిక పాఠశాలలో జరిగిన విద్యార్థిని తరగతి గదిలోనే మ రిచి బడికి తాళమేసిన ఘటన విద్యావ్యవస్థలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. పిల్లలకు విద్యాబు ద్ధులు నేర్పడంతోపాటు బడి పరిధిలో ఉన్నప్పుడు వారి భద్రత, బాధ్యత కూడా పాఠశాలదే. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేసే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే పరిస్థితి ఏమిటి? జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి తరగతి గదిలో నిద్రపోతున్న విషయాన్ని గుర్తించకుండా పాఠశాల ముగిసిన తర్వాత తాళం వేసి వెళ్లడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సీరియస్‌గా స్పందించారు. మరుసటిరోజే కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ టింగ్‌కు లేటుగా వచ్చిన ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. గతంలోనూ పలువురు ఉపాధ్యాయులు విధులను మరిచి ‘యూబిట్‌’ కాయిన్‌ దందాలను చేయడం, జైలుకూ వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది.

పిల్లల భద్రత, బాధ్యత..

పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఎంత ముఖ్యమో.. వారు సురక్షితంగా ఉన్నారో.. లేదో.. చూసుకోవడం అంతే ముఖ్యం. ప్రాథమిక పాఠశాలల్లో చదివే చిన్నారులు తమ అవసరాలను సరిగ్గా చెప్పలేని వయసులో ఉంటారు. బడి వేళలు పూర్తయిన తర్వాత తరగతి గదిలో ఎవరైనా మిగిలిపోయారా? ఇంటికి వెళ్లారా? అని నిర్ధారించుకోవాల్సి న బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిపై ఉంటుంది. బడి ముగిసిందంటే బాధ్యత ముగిసినట్లు కాదు. చివరి విద్యార్థి కూడా సురక్షితంగా బయటకు వెళ్లే వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే.

క్లాస్‌లోనూ ఫోన్‌లోనే..

ఎన్ని మెమోలు వచ్చినా, పైఅధికారులు ఎన్ని షోకా జ్‌లు ఇచ్చినా కొందరు ఉపాధ్యాయుల తీరు మార డం లేదు. తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో సెల్‌ఫోన్‌లో ముచ్చట్లు పెడుతు న్న తీరుపైనా ఆరోపణలున్నాయి. యూబిట్‌ కేసులో జైలు వరకూ వెళ్లివచ్చిన ఘటనలు చోటు చేసుకున్నా.. కొంతమంది టీచర్లు మారడం లేదు. ఇప్పటికీ ఆన్‌లైన్‌ దందాలు, రియల్‌ ఎస్టేట్‌, ఇతర బిజినె

స్‌లు చేస్తూ.. పాఠాలను పక్కదారి పట్టిస్తున్నారు. పిల్లల హాజరు తీసుకునే సార్లకే బయోమెట్రిక్‌, లైవ్‌లొకేషన్‌, ముఖగుర్తింపులు పెట్టాల్సి వస్తోందంటే సిగ్గుచేటు. ఇన్ని పెడుతున్నా కొంతమంది ప్రబుద్ధులు తప్పించుకుంటున్న తీరు మరీ దారుణం.

విధులు నిర్వహించరా?

బడిని గుడిగా మార్చి, నాలుగుగోడల మధ్య పిల్లల జీవితాలను తీర్చిదిద్దుతున్న గురుదేవుళ్లెందరో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రత్యేకశ్రద్ధ పెట్టి పాఠాలు చెబుతున్న వాళ్లూ ఉన్నారు. ఇప్పటికీ సమయానికి బడికి వెళ్తూ.. తమ విధులకు న్యాయం చేస్తూ.. తమ విద్యార్థులు సాధించే చిన్నచిన్న విజయాలకే పొంగిపోతున్నారు. ఎన్ని సమస్యలున్నా తమను నమ్ముకుని సర్కారు బడులకు వస్తున్న విద్యార్థుల ఆశలను నిలబెడుతున్నారు. కానీ.. కొంతమంది గురువులు మాత్రం తర చూ దారితప్పుతున్నారు. పవిత్రమైన తమ వృత్తికే కళంకం తెస్తున్నారు. పాఠాలు చెప్ప డం అటుంచి, కనీసం బడికి వెళ్లకుండా ఎలా ఉండాలా..! వె ళ్లినా బయటకు ఎలా వెళ్లాలా..! అనే ఆలోచనలు చేస్తున్నారు. మనసులో డబ్బు ఆశతో ఉన్న సదరు టీచర్లు కళ్లెదుట తమకోసం వేచి ఉన్న విద్యార్థులను విస్మరిస్తున్నారు. వారి భవిష్యత్‌నూ అంధకారం చేస్తున్నారు.

బెంబర ఘటనపై కలెక్టర్‌ సీరియస్‌

బెంబర బడిలో విద్యార్థిని తరగతి గదిలోనే ఉంచడంపై కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా సీరియస్‌ అ య్యారు. సదరు పాఠశాల హెచ్‌ఎంను స స్పెండ్‌ చేశారు. స్కావెంజర్‌ను విధుల నుంచి తొలగించారు. ఇది జరిగిన మరుసటి రోజే.. కలెక్టరేట్‌లో పెట్టిన మీటింగ్‌కు పలువురు ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఆలస్యంగా వచ్చారు. దీనిపైనా కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించారు. వారందరికీ షోకాజ్‌ నోటీసులు ఇ చ్చారు. డీఈవోతో కలిసి కనీసం వారంలో ఒ క్క పాఠశాలనైనా కలెక్టర్‌ పరిశీలిస్తున్నారు. ఉ న్నతాధికారులు ఇంత చేస్తున్నా.. కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తికి కనీస న్యా యం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.

నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పాం

ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పాం. బెంబర పాఠశాల ఘటన నేపథ్యంలో ప్రతీ పాఠశాలలో హెచ్‌ఎంలు, సిబ్బంది పక్కాగా పర్యవేక్షించాలని ఆదేశించాం. దసరా సెలవుల తర్వాత బడి ప్రారంభం కాగానే తీసుకోవాల్సిన చర్యలనూ ప్రతీ హెచ్‌ఎంకు పంపించాం.

– భోజన్న, జిల్లా విద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement