కడెం: ఎల్‌నినో ప్రభావంతో సాగు నీరందక పంట నష్టపోయిన రైతులకు పరిహారంఅందించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని చిట్యాల్, బెల్లాల్, మద్దిపడగ, వకీల్‌నగర్ గ్రామాల్లో ఎండిన పంటలను పరి శీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోనందునే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆరోపించారు. తక్షణమే పంటల సర్వే చేపట్టి బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్‌యాదవ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌నా యక్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్, ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, నాయకులు కిష్టయ్య, రమేశ్, దేవరాజ్, తిరుమల్, రాజేందర్, శ్రీనివాస్, గంగన్న తదితరులున్నారు.


