భైంసాటౌన్: పట్టణంలోని కాటన్ మార్కెట్‌యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఏఎంసీ చైర్మన్ సిందే ఆనంద్‌రావు కొనుగోళ్లు ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి క్వింటాల్‌కు రూ.8,667 మద్దతు ధర పొందాలని సూచించారు. పత్తిలో 8–12 శాతం తేమ ఉండాలని, ఎక్కువ ఉంటే మద్ధ తు ధర లభించదని పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా సీసీఐ కేంద్రాల్లోనే పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, పట్టా పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. ఏఎంసీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, వ్యాపారులు, ఏఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.


