పెంబి: మండలంలోని లోతర్యతండా, తాటిగూడ గ్రామాలకు చెందిన మేకల కాపరులు శేషరావు, శ్రీనుపై పెంబి డీఆర్వో ప్రతాప్ నాయక్‌పై దాడి చేశారని టీఏజీఎస్ నాయకులు, రాజ్‌గోండ్ సేవా సమితి సభ్యులు ఆరోపించారు. ఘటనపై విచారణ చేపట్టాలని కోరుతూ.. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడేకు వినతిపత్రం అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి శంభు, రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు విలాస్, రూప్సింగ్, భగవంత్‌రావు, భీంరావు, రాంచందర్, సేసేరావు తదితరులున్నారు.


