నిర్మల్చైన్గేట్: బహుజన పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతిని గురువారం క లెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా ని ర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేశ్ అధికారులతో కలిసి సాయ న్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయన్న సాగించిన పోరాటాలు స్పూర్తి దా యకమని కొనియాడారు. పేదల పక్షాన నిలబడి తెలంగాణ ‘రాబిన్ హుడ్’గా పేరుగాంచిన సాయన్న సేవలను ముదిరాజ్ కుల సంఘాల నాయకులు స్మరించుకున్నారు. బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమాధికారి దయానంద్, అధికారులు, ముది రాజ్ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


