ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌కు స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌కు స్థల పరిశీలన

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

సారంగపూర్‌: మండలంలోని జామ్‌ గ్రామంలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌ బుధవారం స్థానిక సర్పంచ్‌ కరిపె రవళితో కలిసి స్థల పరిశీలన చేశా రు. జామ్‌ కరిసెల గుట్ట ప్రాంతంలోని సెగ్రిగేషన్‌ షెడ్డుకు సమీపంలోనే స్థలం అనువుగా ఉన్నట్లు నిర్ధారించి ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ.. గ్రామంలో 100శాతం ప్లాస్టిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు చెత్తతో సేంద్రియ ఎరువుల త యారీలో గ్రామపంచాయతీ సిబ్బంది మొదటి స్థా నంలో ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. అందుకే జామ్‌ గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామసభ నిర్వహించి ప్రజలు, పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌ రవళి, పంచాయతీ కార్యదర్శి నరేశ్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, అజీజ్‌ఖాన్‌, వివిధ గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, మల్లయ్య, బీజేపీ నాయకులు విలాస్‌, నర్సయ్య, తిరుమలాచారి, ప్రశాంత్‌, వార్డు సభ్యులు నరేశ్‌, రాము తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement