పోడు సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

పోడు సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

● ఐటీడీఏ పీవో మంద మకరందు

మంచిర్యాలక్రైం: పోడు భూముల సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేద్దామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో బుధవారం డీఎఫ్‌వో రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి పోడు భూముల సమస్యలపై చర్చించారు. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా కల్పించాల్సిన హక్కుల అమలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములకు సంబంధించిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గిరిజనుల భూ హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేద్దామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement