నిర్మల్‌టౌన్: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సహస్ర బాక్సింగ్ అ కాడమీలో బుధవారం జోనల్ స్థాయి బాక్సింగ్ పో టీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. అండర్–14 బాలురు, అండర్–17 బాల, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నుంచి సు మారు 70మంది హాజరయ్యారు. అండర్–14 బా లుర విభాగంలో అవ్యుత్, ఆదిత్య, సిద్ధార్థ్, అభిజి త్, సంజయ్, శ్రీహర్ష, అండర్–17 బాలుర విభా గంలో అనిల్‌కుమార్, దీక్షిత్, శ్రీహర్ష, మహేంద్ర, మనీశ్, బాలికల విభాగంలో విశాఖ, వాసవి, అక్షర, అశ్విత, వనిత, అనన్య, అక్షయ, హర్షిత, దివ్య, మ ల్లేశ్వరి, ప్రవళి, వివిధ బరువు విభాగాల్లో ఎంపికయ్యారు. వీరు త్వరలో మంచిర్యాలలో నిర్వహించనున్న జోనల్ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడల అధికా రి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.


