నిర్మల్‌టౌన్: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి పూరీ జగన్నాథ్ యాత్రకు ప్రత్యేక బస్సు బుధవారం బయలుదేరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పండరి కొబ్బరికాయ కొట్టి యాత్రను ప్రారంభించారు. ని ర్మల్ నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక బస్సు అన్నవరం, సింహాచలం, కోణార్క్ మీదుగా పూరీ జగన్నాథ్ క్షేత్రానికి చేరుకుంటుంది. అనంతరం అరసవల్లి, శ్రీకూర్మం, విశాఖపట్నం, ద్వారకా తిరుమల తదితర ప్రాంతాలను సందర్శించి ఈ నెల 7న తిరి గి నిర్మల్‌కు చేరుకుంటుందని డీఎం తెలిపారు. ఈ నెల 20తర్వాత సోమనాథ్, ద్వారకా, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రాల సందర్శనకు మరో యా త్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


