పేదల పక్షపాతి వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

పేదల పక్షపాతి వైఎస్సార్‌

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

వాతావరణం

9లోu

ఖానాపూర్‌: పేదల పక్షపాతి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ కొనియాడారు. బుధవా రం ఖానాపూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్‌, 108 అత్యవసర సేవలు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. రైతు పక్షపాతిగా, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వైఎస్సార్‌ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో నాయకులు చిన్నం సత్యం, తోట సత్యం, గొర్రె గంగాధర్‌, జంగిల్‌ శంకర్‌, దయానంద్‌, అంకం రాజేందర్‌, పోలంపల్లి ర మేశ్‌, షబ్బీర్‌ పాషా, శ్యామ్‌, అమానుల్లా ఖాన్‌, కిశోర్‌, గంగన్న, జమాల్‌, సత్యనారాయణ, రాజేశ్వర్‌, రాజు నాయక్‌, నిమ్యా నాయక్‌, శేషాద్రి, పెదులు, సజ్జు, శంకర్‌, రాజన్న, మహేశ్‌, రమే శ్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా చిన్నపాటి వర్షం కురుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement