నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jul 31 2026 11:59 PM | Updated on Jul 31 2026 11:59 PM

● గోదావరికి పెరిగిన వరద ● జిల్లాలో లిఫ్టుల మోటార్లు ఆన్‌ ● ఎల్‌నినో ఆందోళనలో ఉన్న రైతులకు ఊరట.. శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

‘కడెం’కు తగ్గిన వరద

కడెం: కడెం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టుకు 43,788 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఆరు గేట్లు ఎత్తి 59,741 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నం వరకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో వరద గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్‌కు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.425 అడుగులు ఉంది. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 7,805 క్యూసెక్కులకు పడిపోయిందని అధికారులు తెలిపారు.

నేడు కడెంకు మంత్రుల రాక

కడెం: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్‌ తెలిపా రు. మంత్రులు మధ్యాహ్నం 12:45 గంటలకు హెలికాప్టర్‌లో కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడెం ప్రాజెక్టుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:35 గంటలకు కడెం ప్రాజెక్టును సందర్శించి, ప్రా జెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వలు, వరద ని ర్వహణ, భద్రతా చర్యలు, అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.

భైంసా: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజ న్‌ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేశాయి. జి ల్లాలో వరి, పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వే సిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేసిన రైతుల్లో నీటి కొరతతో పంటలు ఎండిపోతాయేమోనన్న ఆ ందోళన నెలకొంది. ఈ తరుణంలో అల్పపీడనం ప్ర భావంతో ఎగువ మహారాష్ట్రతోపాటు జిల్లాలో మూ డు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు ప్రాణం వచ్చింది. మరోవైపు వర్షాలకు గోదావరికి వరద రైతుల్లో కొత్త ఆశలు నింపింది.

వరి సాగు ప్రధానం

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరిసాగు ప్రధానంగా గోదావరి ఆధారిత ఎత్తిపోతల పథకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో సాగు పనులు నెమ్మదించినా, ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం పెరగడం వ్యవసాయానికి కొత్త ఊపును తీసుకొచ్చింది. కాలువల్లో నీరు పారుతుండటంతో రైతులు ఎరువుల వినియోగం, కలుపు నివారణ వంటి పనులను వేగవంతం చేస్తున్నారు.

ఈ నెలలోనూ కురిస్తే

ఆగస్టు నెలలో కూడా వర్షాలు కురిసి గోదావరిలో ప్రవాహం కొనసాగితే జిల్లాలో ఖరీఫ్‌ పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వ్యవసాయాధికారులు, రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన ఎత్తిపోతల పథకాలు వేలాది ఎకరాలకు ప్రాణాధారంగా మారాయి. ఎండిపోతాయనుకున్న పంటలు ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడతాయని రైతులు ఉషారుగా పొలాల బాట పడుతున్నారు.

పెరిగిన నీటి మట్టం..

గోదావరి నీటి మట్టం పెరగడంతో జిల్లాలోని ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల మోటార్లను ఆన్‌ చేశారు. దీంతో నీరు చెరువులకు చేరుతోంది. బాసర, కన్కపూర్‌, కౌట, పంచగుడి, ఆష్టా, రాజూర, గడ్‌చాంద్‌, సిద్ధులకుంట తదితర ప్రాంతాల్లో సాగునీటి సరఫరా ప్రారంభమైంది. దీంతో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని రోజులు గోదావరిలో ప్రవాహం కొనసాగితే పంటలు పూర్తిగా గట్టెక్కుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఎత్తిపోతల పథకాలు,

ఆయకట్టు వివరాలు(ఎకరాల్లో..)

బాసర 2,500

ఆష్టా 1,500

పంచగుడి 1,500

కన్కపూర్‌ 3,500

రాజూర 1,000

గడ్‌చాంద 1,500

మన్మద్‌ 900

పోట్‌పల్లి 500

కౌట 2,000

పార్పల్లి 365

సిద్ధులకుంట 1,000

అలూరు 450

బిరవెల్లి 370

డోంగుర్‌గాం 530

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement