విన్నపాలు.. ఎన్నిసార్లు | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు.. ఎన్నిసార్లు

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ కోసం ఎదురుచూపులు కేంద్రానికి పలుమార్లు ప్రజాప్రతినిధుల వినతులు రైల్వేబోర్డు వద్ద వెయిటింగ్‌లో ఫైలు

నిర్మల్‌: ‘అరె.. దేశంల ఎన్నో కొత్తకొత్త రైల్వేలైన్లేస్తున్నరు. కొత్త రైళ్లూ తెస్తున్నరు. ఒకటా రెండా నాలు గు దశాబ్ధాలుగా అడుగుతున్న నిర్మల్‌ –ఆదిలాబాద్‌ లైన్‌ మాత్రం ఏస్తలేరు. గట్టిగ అంటే 130 –140కి.మీ. అంతే. ఈ మాత్రం పట్టాలెయ్యడానికి నాలుగుతరాలు ఎదురుచూడాల్న..! ఎన్నిసార్లు జిల్లాకెళ్లి ఢిల్లీ దాకా మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పోయి మొరపెట్టుకోవాలె..! ఎన్నిసార్లు ఈ లైన్‌ ఆవశ్యకత ఏందో వారికి వివరించాలె..! అసలు.. కేంద్రానికి ఈ ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ ఎయ్యాలన్న ఉద్దేశం ఉందా..!’ అని నిర్మల్‌ –ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలు విరక్తి చెందుతున్నారు. ‘ఇక జిల్లా మీదుగా రైలు..’అంటూ వినీవినీ విసుగు చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు ఇంకెన్నిసార్లు విన్నపాలు వినిపిస్తారు.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

రైల్వేబోర్డు దగ్గర..

దక్షిణమధ్య రైల్వే 136.50 కిలోమీటర్ల ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌ లైన్‌ నిర్మాణానికి రూ.4,300కోట్ల అంచనాతో గత ఏడాది డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌(డీపీఆర్‌) పూర్తి చేసింది. సోన్‌ వద్ద గోదావరిపై బ్రిడ్జితో పాటు ఘాట్‌రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలను చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖను దాటుకుని రైల్వేబోర్డు దగ్గర ఆగింది. రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే దాదాపుగా ఫైనాన్షియల్‌ క్లియరెన్స్‌ వచ్చేస్తుంది. కానీ.. రైల్వేబోర్డు పెడుతున్న కొర్రీలతోనే జాప్యమవుతున్నట్లు తెలుస్తోంది.

రైల్వేలైన్‌ వివరాలు..

రైల్వేలైన్‌ : ఆర్మూర్‌ –నిర్మల్‌ –ఆదిలాబాద్‌

లబ్ధిపొందే డివిజన్లు : ఆర్మూర్‌, నిర్మల్‌, భైంసా, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌

లబ్ధిపొందే ప్రజలు : దాదాపు 7లక్షలు

లైన్‌ నిర్మాణ అంచనా : రూ.4,300 కోట్లు

లైన్‌ నిర్మాణ దూరం : 136.50 కిలోమీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement