న్యూస్‌రీల్
నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలోని స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆదివారం పాటే మా ప్రాణం సంగీత అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నేపథ్య గాయని, స్వరకోకిల ఎస్.జానకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, కళాకారుడు డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. జానకి మరణం సంగీతాభిమానులకు తీరనిలోటన్నారు. తన మధుర గాత్రంతో, భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఆమె స్వరం తరతరాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాటే మా ప్రాణం సంగీత అకాడమీ అధ్యక్షుడు నాగరాజు, హనుమంతు, వేణు వర్మ, శ్రీనివాస్, అనిల్, దశరథ్, శ్రీకాంత్, శిరీషాదేవి, బన్నీ, నవ్య, సుజాత, పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు.
‘కళాశాలల బంద్
విజయవంతం చేయండి’
భైంసాటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర పన్నుతోందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ బుదారి గంగాప్రసాద్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని కోరారు. మాధవ్, గణేశ్, శివసాయి పాల్గొన్నారు.


