దశలవారీగా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

దశలవారీగా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

● ఎమ్మెల్యే రామారావ్‌ పటేల్‌

తానూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే రామారావ్‌ పటేల్‌ సూచించారు. ఆదివారం మండలంలోని మసల్గాతండా గ్రామంలో లబ్ధిదారులు జాదవ్‌ ఉషాబాయి, జాదవ్‌ సుబద్రాబాయిలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గత పదేళ్ల పాలనలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలోని ఏఒక్క నిరుపేదకు ఇల్లు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. తానూరు నుంచి మొగ్లి మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి ప్రయాణికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిన్నారెడ్డి, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సోమ్‌నాథ్‌, తానాజీపటేల్‌ సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement