భైంసారూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఆదివారం భైంసా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఉన్న 7.55 లక్షల మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 42శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియ కొంత మందగమనంలో ఉందని, భైంసా పట్టణంలో శనివారం సాయంత్రం నాటికి 20 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్ కుమార్, ఆయా పార్టీల ప్రతినిధులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఫస్ట్.. స్టేట్‌లో సెకండ్..
కుంటాల: ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో కుంటాల మండలం జిల్లాలో ప్రథమ, రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. మండలంలోని కల్లూరు ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. నమోదు ప్రక్రియలో ముందున్న మండలాలను గుర్తించి ఉత్తమ అధికారులకు అవార్డులు ప్రకటిస్తామన్నారు. తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచ్ పెంటవార్ దశరథ్, ఆర్‌ఐ రాజేశ్వర్, కార్యదర్శి మాలతి ఉన్నారు.
ముధోల్: మండలంలోని తరోడ గ్రామాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదివారం సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్ ఆన్‌లైన్ ప్రక్రియ నిర్వహణ తీరు, రికార్డుల నమోదు విధానాన్ని స్వయంగా పరిశీలించారు.


