నిర్మల్‌టౌన్: అయోధ్య శ్రీరాముని పవిత్ర పాదుకలు, బాల అయోధ్య రాముడు, శ్రీరాముని ధనస్సు శనివారం జిల్లా కేంద్రంలోని నటరాజనగర్‌కు చెందిన ప్రకాశ్ నివాసానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీరాముడు పాదుకలను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముని పాదుకలకు పూజలు చేశారు. హారతులు ఇచ్చారు. అయోధ్య నుంచి తీసుకువచ్చిన పవిత్ర పాదుకల దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిందని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశ్, ఆమెడ శ్రీధర్, మహేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు


