కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: దొడ్డి కొమురయ్య వర్ధంతిని క లెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమా ర్‌ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి కాలంలో తెలంగాణ ప్రజలను బానిసత్వపు సంకెళ్ల నుంచి బంధవిముక్తి చేసేందుకు పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఎంతో తెగువతో నిజాం నిరంకుశత్వానికి, దొరల ఆగడాలపై వ్యతిరేకంగా పో రాడారన్నారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతుల కార్యక్రమాలు ప్రభుత్వాలు అధి కారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నా రు. దొడ్డి కొమురయ్య ఆశయాలను అందరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ బీసీ సంక్షేమ అధికారి సత్యనారాయణ, పలువురు సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement