ముజ్గి పాఠశాలను తనిఖీ చేసిన అబ్జర్వర్‌ | - | Sakshi
Sakshi News home page

ముజ్గి పాఠశాలను తనిఖీ చేసిన అబ్జర్వర్‌

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

నిర్మల్‌ రూరల్‌: మండలంలోని ముజ్గి ప్రీ ప్రైమరీ పాఠశాలను ఎస్‌సీఆర్టీ డిప్యూటీ డైరెక్టర్‌, రాష్ట్రస్థాయి అబ్జర్వర్‌ నాంపల్లి రాజేశ్‌ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న బోధన, ఆటల ద్వారా అభ్యసన పరిశీలించారు. తరగతిగది వాతావరణం, బొమ్మలు, ఆట వస్తువుల లభ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌వో ప్రవీణ్‌ కుమార్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement