● పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు ● ఈజీ వినియోగం.. మనీ ఆదా.. ● పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

● పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు ● ఈజీ వినియోగం.. మనీ ఆదా.. ● పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

● పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు ● ఈజీ వినియోగం.. మనీ ఆదా.. ● పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం

నిర్మల్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుతూనే ఉండటంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండటంతో జిల్లాలో ఈవీ(ఎలక్ట్రిక్‌ వెహికల్‌)ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు ఇప్పుడు జిల్లాకేంద్రంతోపాటు మండలాల్లోనూ పరుగులు తీస్తున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, ఇంధన వ్యయం లేకపోవడం, నడపడం ఈజీ కావడం, పర్యావరణానికీ మేలు ఉండటంతో ఉద్యోగులు, వ్యాపారులు, యువత ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.

లెక్కేస్తూ.. తెచ్చేస్తూ..

నిర్మల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.117 ఉండగా, ఒక ఈవీ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్‌ చేయడానికి కేవలం రూ.12 నుంచి రూ.18 మాత్రమే ఖర్చవుతోంది. అంటే సుమారు 100 కి.మీ ప్రయాణానికి ఈవీ ఖ ర్చు పెట్రోల్‌ వాహనంతో పోలిస్తే దాదాపు 10 నుంచి 15 రెట్లు తగ్గుతుంది. ఈనేపథ్యంలో రోజూ ఉ ద్యోగాలు, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే వారు పెట్రోల్‌ ఖర్చుతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలతో గణనీయమైన ఆదా అవుతోందని లెక్కేసి చెబు తున్నారు. గతంలో నెలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెట్రోల్‌ వాహనానికి ఖర్చయ్యేదని, ప్ర స్తుతం విద్యుత్‌ ఛార్జింగ్‌తో చాలా తక్కువ వ్యయంతోనే అదే దూరం ప్రయాణిస్తున్నామంటున్నారు.

పర్యావరణానికీ ఊరట..

పొగ, కార్బన్‌ ఉద్గారాలు లేకపోవడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఈవీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది.

ఛార్జింగ్‌ స్టేషన్ల కొరత..

ఈవీ వినియోగం పెరుగుతున్నప్పటికీ జిల్లాలో పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు లేవు. తప్పని పరిస్థితుల్లో ఇంటి వద్దే ఛార్జింగ్‌ చేసుకోవడం ఒక్కటే కొంత ఇబ్బంది. రహదారులవెంట ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

జిల్లాకేంద్రంలో రోడ్లపై వెళ్తున్న ఈవీ స్కూటర్లు

ఈవీ–పెట్రోల్‌.. ఏది లాభం..!

అంశం ఈవీ వాహనం పెట్రోల్‌ వాహనం

ఇంధన వ్యయం ఫుల్‌చార్జ్‌కు రూ.12–18 లీటర్‌ పెట్రోల్‌ రూ.117

100కి.మీ. ప్రయాణ ఖర్చు రూ.10 –15మాత్రమే రూ.180–230(మైలేజీని బట్టి)

నెలకు ఇంధన వ్యయం రూ.120–150 రూ.1,900–2,300

అదనపు ఖర్చు 00 రూ.800–రూ.1,000

నిర్వహణ చాలా తక్కువ ఇంజిన్‌ఆయిల్‌, ఫిల్టర్లు, సర్వీసింగ్‌

కాలుష్యం పొగ,శబ్ధ కాలుష్యం ఉండదు కార్బన్‌ ఉద్గారాలు విడుదలవుతాయి

చార్జింగ్‌/ఇంధనం ఇంట్లోనే చేసుకోవచ్చు పెట్రోల్‌బంక్‌కు వెళ్లాల్సిందే

ప్రయాణదూరం ఒక్క చార్జ్‌కు 100–150కి.మీ ట్యాంకు నింపితే 300–500 కి.మీ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement