న్యూస్‌రీల్
జై హరి విఠల..
మహారాష్ట్రలోని శ్రీవిఠల–రుక్మిణి స్వామివారి దర్శనం కోసం జిల్లా భక్తులు పండరిపూర్ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. విఠల నామస్మరణతో యాత్ర మొదలు పెట్టారు.
డాక్టర్.. ఈవీ కార్..
జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు డాక్టర్ బీఎల్‌ఎన్‌రెడ్డి వృత్తిరీత్యా రోజూ తమ హాస్పిటల్‌తోపాటు వివిధ ఆస్పత్రులు, పేషెంట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వివిధ వైద్య సెమినార్ల కోసం ఇతర పట్టణాలు, హైదరాబాద్‌కూ వెళ్తుంటారు. ఈక్రమంలో నడపడానికి సౌకర్యంగా ఉండటంతోపాటు పర్యావరణానికి మేలు కలిగే వాహనం ఉండాలని ఈవీ కారు ఎంచుకున్నారు. ఈవీ నడపడం సౌకర్యంగా ఉందని, శబ్ద, వాయు కాలుష్యం ఉండదని, పర్యావరణానికీ మేలు చేస్తుందంటున్నారు.
ఆటో మారింది.. ‘ఆదా’యం పెరిగింది
జిల్లా కేంద్రానికి చెందిన ప్రసాద్ ఇదివరకు పెట్రోల్ ఆటో నడిపేవారు. రోజుకు వందకిలోమీటర్ల మేర ఆటో తిప్పడానికి రూ.300 నుంచి రూ.350 వరకు పెట్రోల్‌కే ఖర్చయ్యేది. ఇటీవల ఈవీ ఆటో తీసుకున్నారు. ఎలక్ట్రిక్ ఆటోతో వంద కిలోమీటర్ల మేర అయ్యే ఖర్చు ఏకంగా రూ.60కి తగ్గిందంటున్నాడు.


