వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

వాతావరణం

ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది.
పంట మార్పిడిని ప్రోత్సహించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: పంట మార్పిడి విధానాన్ని, ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సూచించారు. హై దరాబాదులోని రాష్ట్ర సచి వాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధి కారులతో శనివారం వ్యవసాయ శాఖపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలలో అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు. సూక్ష్మ సేద్య పద్ధతులు రైతులు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులన్నీ రైతులకు సరిపడా అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు స్వయంగా ఈ అంశంపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

సీజనల్‌ వ్యాధులపై

అప్రమత్తంగా ఉండాలి..

వర్షాకాలం వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా సీఎస్‌ సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయి డ్‌ తదితర వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల వారీగా ప్రణాళికలను రూపొందించామన్నారు. రైతుల అవసరాల మేరకు యూరియాను అందిస్తామన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వయంగా ఆస్పత్రులను తనిఖీ చేశామని, వైద్యాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, డీఏవో అంజిప్రసాద్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఈవో భోజన్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement