అసంపూర్తి భవనాలు.. ఆరుబయట చదువులు | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తి భవనాలు.. ఆరుబయట చదువులు

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

● పలు పాఠశాలలో అసంపూర్తి భవనాలు ● ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

లక్ష్మణచాంద: తమది ప్రజా ప్రభుత్వమని, ప్రభు త్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. లక్ష్మణచాంద మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు తగినంతగా లేవు. విద్యార్థులు సమస్యల మధ్య చదువుకుంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క గది మాత్రమే బాగుండగా, మిగతా నాలుగు గదుల నిర్మాణం అ సంపూర్తగా ఉంది. దీంతో ఇండోర్‌ షటిల్‌ కోర్టులో తరగతులు నిర్వహిస్తున్నారు. 2023లో ‘మన ఊరు మన బడి’ కింద రెండు గదులకు రూ.38 లక్షలు మంజూరయ్యాయి. అయినా ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇక చామన్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో 1–5 తరగతుల్లో 35 మంది, ప్రీ–ప్రైమరీలో 10 మంది మొత్తం 45 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం మూడు గదులు మాత్రమే ఉండటంతో ఒకటి ప్రీ–ప్రైమరీకి కేటాయించారు. మిగతా రెండింటిలో నాలుగు తరగతులు నిర్వహిస్తున్నారు. 2022లో రెండు అదనపు గదులకు రూ. 30 లక్షలు మంజూరైనా ఇంకా అసంపూర్తిగానే ఉ న్నాయి. పొట్టపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1–5 తరగతులకు 25 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు గదులు బాగున్నా, మిగతా మూడు గదులు వర్షం పడితే ఉరుస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

వర్షాకాలం ఇబ్బందిగా ఉంది

పొట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడు గదులు వర్షానికి ఉరుస్తున్నాయి. దీంతో అందులో పిల్లలు కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టి అదనపు గదులు మంజూరు చేయాలి.

– సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement