న్యూస్‌రీల్
కట్టెలపొయ్యి మీదనే..
సరిపడా సిలిండర్లు లేక కుంటాల ఉన్నత పాఠశాలలో కట్టెలపొయ్యిపైనే మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. మండలంలోని సూర్యాపూర్, ఓల, మెదన్‌పూర్, అంబుగామ, హనుమాన్‌నగర్‌తండా, సేవాదాస్‌నగర్‌తండా ప్రాథమిక పాఠశాలల్లో వంటగదులు లేవు. ఆరుబయట లేదంటే తమ ఇళ్లలో వంట చేసుకొని రావాల్సిన పరిస్థితి.
ఎన్యూమరేషన్ ఫారాల
పంపిణీలో జాప్యం వద్దు
భైంసాటౌన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఓ టర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ ఆదేశించారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక ఎన్యూమరేషన్ పంపిణీ శిబిరాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అక్కడి ఓటర్లతో మాట్లాడి సమస్యలు, అర్హులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫారాల పంపిణీ వేగవంతం చేయాలని అఽధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శశిభూషణ్ ఉన్నారు.
చెట్టుకింద వంట..
సారంగాపూర్ మండలం సాయినగర్ గ్రామ పాఠశాలలో ఇలా చెట్టు నీడలో మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యిపైనే. ఇక్కడ వంటగది లేదు. వర్షం పడితే నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనంలో వంట చేయాల్సిన పరిస్థితి.


