ప్రత్యేక దృష్టి పెట్టాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక దృష్టి పెట్టాలి..

Jul 3 2026 11:50 PM | Updated on Jul 3 2026 11:50 PM

పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ నగేష్‌ సూచించారు. ప్రతీజాబ్‌కార్డుదారుకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్లు, అటవీ ప్రాంతాల్లో సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలని, రేషన్‌ బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు.

సమాన పని కల్పించాలి..

ఉపాధి హామీ పనుల్లో సమాన పనిదినాలు, సమాన వేతనం అమలు చేయాలని, అనుమతులు లభించిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు యూరియా యాప్‌ వినియోగంపై క్షేత్రస్థాయిలో సహాయం అందించాలని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించాలి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నచోట పరిష్కారం చూపాలని, నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూచించారు. బాదన్‌కుర్తిలో ఉపాధిహామీ పనులపై ఆడిట్‌ చేయించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట పంచాయతీ కార్యదర్శులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిశీలించాలని చెప్పారు.

ప్రమాదాలు నివారించాలి..

భైంసా సమీపం 61వ జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ సూచించారు. బాసర వంతెనను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. బాసర, తానూరు మండలాల్లో మిషన్‌ భగీరథ నీరందడం లేదని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement