బాధ్యతగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

● ఎస్పీ జానకీషర్మిల

దస్తురాబాద్‌: పోలీసులు విధులు బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్‌ స్టేషన్‌లో మొక్కలు నాటి, పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్‌ నిర్వహణ, శాంతి భద్రతల పరిస్థితులను, నేరాల దర్యాప్తు, పెండింగ్‌ కేసుల పురోగతి తీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. తర్వాత సిబ్బందితో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పటుపై గ్రామ అభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గోదావరి వరదలతో ముంపునకు గురయ్యే గోడిసీర్యాల గ్రామ గోదావరి తీర ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామ పెద్దలకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట నిర్మల్‌ డీఎస్పీ పి.శ్రీనివాస్‌, సీఐ కె.సత్యానారాయణ, మల్లేశ్‌, ఖానాపూర్‌, కడెం ఎస్పైలు రాహుల్‌ గైక్వాడ్‌, సాయికృష్ణ, సాయికుమార్‌ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement