రాష్ట్రస్థాయి ప్రత్యేక శిక్షణలో జిల్లా రీసోర్స్‌పర్సన్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ప్రత్యేక శిక్షణలో జిల్లా రీసోర్స్‌పర్సన్లు

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నిర్వహిస్తున్న మూడు రోజుల రాష్ట్రస్థాయి సమీకృత ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో నిర్మల్‌ జిల్లా నుంచి రిసోర్సుపర్సన్లుగా ఉపాధ్యాయులు అబ్దుల్‌ అజీమ్‌, ఎ.కిషన్‌, ఎ.వనిత, కె. జ్యోతి, శశిరాజ్‌, ధీరజ్‌, వెంకటేశ్‌, చంద్రప్రకాశ్‌, రామ్మోహన్‌, నవీన్‌గౌడ్‌ పాల్గొంటున్నారు. ఈ శిక్షణలో భోదనలో నాణ్యత పెంపు, విద్యార్థి కేంద్రిత అభ్యసనం, వినూత్న బోధనా విధానాలు, తరగతి గది నిర్వహణ తదితర అంశాలపై మూడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన ఈ నలుగురు రిసోర్స్‌ పర్సన్లు త్వరలో జిల్లాలోని ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణలో నేర్చుకున్న అంశాలను అందించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement