పుస్తక జ్ఞానానికి సామాజిక కోణం జోడించాలి | - | Sakshi
Sakshi News home page

పుస్తక జ్ఞానానికి సామాజిక కోణం జోడించాలి

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

లక్ష్మణచాంద: విద్యార్థులు పుస్తక జ్ఞానానికి సామాజిక కోణాన్ని కూడా జోడించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. సోన్‌ కస్తూరిబాగాంధీ విద్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, బోధన, వసతి, ఆహారం, పరి శుభ్రత తదితర అంశాల గురించి ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యాసస్థాయిని పరిశీలించారు. అనంతరం వంటశాల, సరుకుల నిల్వ గది, భోజనశాలను తనిఖీ చేసి అక్కడి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. మెస్‌ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నాణ్యమైన కూరగాయలు, ఆ హార పదార్థాలను మాత్రమే వినియోగించాలన్నా రు. అనంతరం పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టా రు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమకాలీ న సామాజిక, శాసీ్త్రయ, సాంకేతిక అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఈవో భోజన్న, తహసీల్దార్‌ సంతోష్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో జ్యోతి, ఎస్‌వో లతాదేవి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement