నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jul 2 2026 2:59 AM | Updated on Jul 2 2026 2:59 AM

8లోu ● గడ్డెన్న (సుద్ద) వాగు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, గతేడాది జూలై ఒకటి నాటికి 355.50 మీటర్లుగా ఉంది. ప్రస్తుత దాదాపు అదే స్థాయిలో 355.90 మీటర్లు ఉంది. భైంసా, లోకేశ్వరం మండలాల్లో 13,950 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉంది. ● కడెం ప్రాజెక్టులోకి స్వల్పంగా 36 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎగువన ఒకట్రెండు భారీవర్షాలు కురిసినా కడెం నిండిపోతుంది. మొత్తం 68,150ఎకరాల ఆయకట్టు పండుతుంది. ● స్వర్ణ ప్రాజెక్టులోనూ స్వల్పంగా 0.135 టీఎంసీల నీటిమట్టం మాత్రమే ఉంది. స్థానికంగా పెద్దగా వర్షాలు లేకున్నా ఎగువన మహారాష్ట్ర నుంచి వరద వస్తే 8,945 ఎకరాల ఆయకట్టుకు భరోసా ఉంటుంది.

న్యూస్‌రీల్‌

ఆదర్శం ఈ ఉపాధ్యాయులు

పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తాము విధులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సొంత డబ్బులు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026

మౌలిక వసతుల పరిశీలన

నర్సాపూర్‌(జి): మండల కేంద్రంలోని జెడ్పీ ఉ న్నత పాఠశాలను తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసచారి బుధవారం సందర్శించారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏ ర్పాటులో భాగంగా తరగతి గదులు, విద్యార్థు ల సంఖ్య, ఆటస్థలం, మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల సంఖ్య తదితర వివరాలు నమోదు చే సుకున్నారు. విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి వి ద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ ప బ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌) ఏర్పాటుకు కృషి చేస్తోందని తెలిపారు. ఆయన వెంట డీఈవో భోజ న్న, ఎంఈవో సాయన్న, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ గంగాధర్‌గౌడ్‌, ఏఈ మహేశ్‌కుమార్‌, కుంటాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎత్రాజ్‌ రాజు, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కల్పన, పీడీ దేవేందర్‌, ఉపాధ్యాయులున్నారు.

నిర్మల్‌: జిల్లాలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చురుగ్గా ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. వరి, పత్తి, సోయాబీన్‌ తదితర విత్తనాలు వేసిన రైతులు ప్రాజెక్ట్‌లపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌, కడెం, సదర్‌మట్‌, స్వర్ణ, గడ్డెన్నవాగు తదితర ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతమున్న నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదపైనే ఆయకట్టు రైతుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటివరకు ఎగువన మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు లేక ప్రాజెక్ట్‌ల్లోకి వరద రావడం లేదు.

జిల్లాలో 15శాతం లోటు

జూన్‌లో జిల్లాలో సగటున సాధారణ వర్షపాతం నమోదైనా మండలాలవారీగా చూస్తే చాలా చోట్ల లోటు వర్షపాతమే కనిపిస్తోంది. జూన్‌ 1నుంచి 30వరకు జిల్లా సాధారణ వర్షపాతం 173.1 మి.మీ. కాగా, వాస్తవంగా 147.5 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 15శాతం లోటుతో జిల్లా మొత్తం మీద వర్షపాతం సాధారణ శ్రేణిలోనే ఉంది. జిల్లాలోని 19మండలాల్లో తొమ్మిది మండలాలు వర్షాభావ జాబితాలో ఉండగా, ఎనిమిది చోట్ల సాధారణ వర్షపాతం ఉంది. కుంటాల, పెంబి మండలాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది. పెంబి మండలంలో అత్యధికంగా 273.1 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 56శాతం అధికంగా ఉంది. కుంటాల మండలంలో 202.5 మి.మీ. వర్షపాతంతో 20శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో

ప్రస్తుత పరిస్థితి ఇలా..

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగితే పంటలకు ఢోకా ఉండదని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. జిల్లాలో లేకున్నా.. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లోకి గణనీయంగా నీరు చేరే అవకాశముంటుంది. జిల్లాలో జలవనరులున్న చోట ఇప్పటికే రైతులు విత్తనాలు వేశారు. ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, రానున్న రోజుల్లో చేరే వరద నీరే వానాకాలం సాగు భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ప్రస్తుతానికి ఎగువన కూడా ఆశించిన వర్షాలు లేకపోవడంతో జిల్లా ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement