ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా మాధ్యమిక విద్యాధికారి జా దవ్ పరశురాం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై గత విద్యాసంవత్సరంలో కళాశాల మంచి ఫలితాలు సాధించడంతో అభినందించారు. గతేడాదితో పోలిస్తే ఈ వి ద్యాసంవత్సరంలో కళాశాలలో ప్రవేశాలు పెరగడంతో ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ రికార్డులు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ఆనందం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


