నిర్మల్‌చైన్‌గేట్: ప్రాణాంతకంగా మారే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను నివారించేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హెచ్‌పీవీ టీకా కు జిల్లాలో ఆశించిన స్థాయిలో స్పందన లేదు. బా లికల ఆరోగ్య రక్షణ కోసం ఉచితంగా టీకా ఇస్తు న్నా తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు, అవగాహన లోపం, సంప్రదాయ భావజా లం కారణంగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 14నుంచి 15ఏళ్లున్న బాలికలు 7,512 మంది ఉండగా ఇప్పటివరకు 3,675 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, సంప్రదాయ పద్ధతులను అ నుసరించే కుటుంబాలవారిని టీకా తీసుకునేందుకు ఒప్పించడం ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. దీంతో లక్ష్యం చేరుకోవడంలో ఆలస్యమవుతోంది.
కార్యక్రమం ప్రారంభమిలా..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న 14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో టీకా పంపిణీ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. సాధారణంగా ఈ టీకాను ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు రూ.వేలల్లో ఖర్చవుతుంది. మొత్తం ప్రక్రియకు సుమారు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వ్యయమవుతుంది. ఇలాంటి విలువైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నా ప్రజల్లో అవగాహన కొరవడి లక్ష్యం చేరని పరిస్థితి ఉంది.
లక్ష్యం ఎందుకు చేరుకోలేదంటే..
టీకా ప్రారంభంలో బాలికలు పదో తరగతి పరీక్షల్లో బిజీగా ఉండటంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు ఎవ రూ ముందుకు రాలేదు. పరీక్షల తర్వాత పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించే బాధ్యత ఇచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తల్లో చాలామందికి జనగణన విధులు అప్పగించారు. పెళ్లి తర్వాత గర్భధారణ సమస్యలు వస్తాయనే అపోహతో చాలామంది తల్లిదండ్రులు బాలికలకు టీకా వేయించేందుకు ఆసక్తి చూపడంలేదు.
క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర
హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సరే కాకుండా ఇతర ప్రమాదకర క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఈ వైరస్ ప్రభావాన్ని ముందుగానే అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడంతోపాటు పలు రకాలైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని పేర్కొంటున్నారు. సుమారు ఆరు రకాల క్యాన్సర్లను గణనీ యంగా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నారు.


