ఆపరేషన్‌ ముస్కాన్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ముస్కాన్‌ను విజయవంతం చేయాలి

Jul 2 2026 2:59 AM | Updated on Jul 2 2026 2:59 AM

● ఎస్పీ జానకీ షర్మిల ● అధికారులతో సమీక్ష

నిర్మల్‌టౌన్‌: ఆపరేషన్‌ ముస్కాన్‌ను విజయవంతం చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే స్పెషల్‌ జువైనెల్‌ పోలీస్‌ యూనిట్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్‌ వె ల్ఫేర్‌ కమిటీ, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యాశాఖలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశ్రమలు, హో టళ్లు, దాబాలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, బస్టాండ్లు, రైల్వేస్టేష న్లు, మార్కెట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, జిల్లా పోలీస్‌ అధికారులు, స్పెషల్‌ జువైనెల్‌ పోలీస్‌ యూ నిట్‌ ప్రతినిధులు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు అనిల్‌, శ్రీలత, జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, జిల్లా కార్మిక అధికారి రాజలింగం, ముస్కాన్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్సై అజ య్‌, సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి డబ్ల్యూఎస్‌ఐ శ్రావణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సత్వర సేవలందించడమే లక్ష్యం

భైంసాటౌన్‌: సత్వర, పారదర్శక, నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. పట్టణంలోని పాత రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆ వరణలోగల క్యాంపు కార్యాలయంలో నిర్వహించి న ప్రజావాణికి హాజరయ్యారు. అంతకుముందు స బ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి న అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించా రు. ప రిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. భరోసా కేంద్రంలో కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు ఇచ్చిన కౌన్సి లింగ్‌ను పరిశీలించారు. అనంతరం పెండింగ్‌ ఫిర్యాదులపై సమీక్షించారు. సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement