● కలెక్టర్ భవేశ్ మిశ్రా ● మాతా, శిశు ఆస్పత్రి తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైద్యులు, సి బ్బందికి సూచించారు. అనంతరం రికార్డులు, రిజి స్టర్లను పరిశీలించారు. 24గంటలు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, మందులు ఉచితంగా అందించా లని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, నవజాత శిశువుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆస్పత్రి పర్యవేక్షకురాలు సరోజ, అధికారులు గోపాల్‌సింగ్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్
నిర్మల్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల ఒకటి నుంచి 31వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలులో ఉంటుందని ఎస్పీ జానకీ షర్మిల ఓ ప్రకటనలో తెలిపా రు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు, మత విధ్వేషా లు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, సందేశాలు, వీడియోలు, ఇతర అభ్యంతకర స మాచారాన్ని ప్రసారం చేసిన వారిపైనా చర్యలు త ప్పవని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.


